ముళ్ళకంపను తొలగించుకున్న గ్రామస్తులు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని పిట్టంబండ గ్రామం నుండి చెట్టుపల్లి పోయే రహదారిలో ఇరువైపులా ముళ్ళ చెట్ల తో రోడ్డు కనపడకుండా పోయింది . ప్రతిరోజు రైతులు పొలాలు వైపు వెళ్లాలన్న తమ అవసరాల కోసం తిరగాలన్న చాలా ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా రాత్రిపూట సమయంలో పాములు, చెడపురుగులు అనేక వంటివి ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవి. సాయంత్రం చీకటి పడగానే అటువైపు వెళ్ళాలంటే ప్రజలు బిక్కుబిక్కుమంటూ వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. పిట్టం బండ గ్రామం నుండి చెట్టుపల్లి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ముళ్లకంపను ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సొంత నిధులతో తొలగించారు. క్లస్టర్ ఇంచార్జ్ వినుకొండ మండలం మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మక్కెన కొండలు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంపై శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ని పిట్టం బండ గ్రామస్తులు చెట్టుపల్లి గ్రామస్తులు కొనియాడారు.(Story : ముళ్ళకంపను తొలగించుకున్న గ్రామస్తులు )
