Home వార్తలు తెలంగాణ విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

0

విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

న్యూస్ తెలుగు/వనపర్తి : శుక్రవారం పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు సహకారంతో పాఠ్య పుస్తకాలలో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని పిల్లల్ని ఆకర్షించే విధంగాతరగతి గదులకు కార్టూన్లు, సైంటిస్టుల చిత్రాలతో పెయింటింగ్ వేయించారు మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గార్ల చేతుల మీదుగా పెయింటింగ్ వర్క్ ను పాఠశాల తరగతి గదులను జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు. ఎస్పీ గారికి విద్యార్థిని విద్యార్థులు స్వాగతం తెలిపారు. ఎస్పీ గారు విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… బాలలకు తరగతి గదిలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందఅన్నారు. ప్రజలకు చట్టాలు, శిక్షలు సప్రవర్తన పై అవగాహన కల్పిస్తున్నాం అని తెలిపినారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తేవాలి, ప్రజలకు సేవలు అందించే విధంగా ఎదగాలి అన్నారు. చాలా సంత్సరాల క్రితం చదువుకోవడానికి సరియైన వసతులు లేవు ఇప్పుడు పరిస్తితి మారినది ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించి ఉన్నతమైన నాణ్యమైన సాంకేతిక విద్య అందిస్తుంది అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో నైపుణ్యాలతో విద్యను బోధిస్తున్నారు అన్నారు. విద్యార్థులు మంచి పుస్తకం, మంచి స్నేహితున్ని ఎంచుకుంటే చాలా సాధించవచ్చు అన్నారు.జిల్లాలో రాష్ర్టంలో ఉన్న ప్రముఖులు, విద్యావంతులు, అధికారులు చాలావరకు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చినవారే అన్నారు. విజయం సాధించిన వారి జీవితాలను విద్యార్ధులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి సహకరించిన యువతను పాఠశాల ప్రధానోపాధ్యాయులను శాలువాతో ఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి విద్యాశాఖ అధికారి,మంజులత, పెద్దమందడి ఎస్సై, శివకుమార్,ACTO ప్రసన్న రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బండి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు జీకే శ్రీనివాస్, రోజా రాణి, కిరణ్ కుమార్, సుచిత్ర, ఈశ్వర్, మధు, పాఠశాల, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.(Story : విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version