Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సూపర్ సిక్స్ సంబరాలు కాదు అటు రైతులు సమస్య చూడండయ్యా

సూపర్ సిక్స్ సంబరాలు కాదు అటు రైతులు సమస్య చూడండయ్యా

0

సూపర్ సిక్స్ సంబరాలు కాదు అటు రైతులు సమస్య చూడండయ్యా

న్యూస్ తెలుగు/వినుకొండ  : అటు చూడండి అయ్యా, ఎరువులు అందక రైతులు అల్లాడుతున్నారు. రైతులు ఎరువులు కోసం రోడ్డు ఎక్కితే కేసులు పెడుతున్నారు. వేల టన్నులు ఎరువులు బ్లాక్ మార్కెట్ కు వెళుతుంటే, ఇదేమీ పట్టనట్లుగా, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గురువారం వైసీపీ కార్యాలయంలో క్రిక్కిరిసిన వైసిపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 4 లక్షల 50 వేల టన్నులు ఎరువులు వచ్చాయంటూ చెబుతున్న కూటమి ప్రభుత్వం సగం ఎరువులు మాత్రమే రైతులకు అందగా, 2 లక్షల టన్నుల ఎరువులు కూటమి నేతలు బ్లాక్ మార్కెట్ కు తరలించి జేబులు నింపుకుంటున్నారని బొల్లా ఆరోపించారు. ఇటీవల శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో పోలీసు, అధికారులు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఘర్షణలో ఎటువంటి సంబంధం లేని వైసిపి కార్యకర్తలపై 307 కేసులు పెట్టి జైలు పాలు చేశారని ఆయన మండిపడ్డారు. పోలీసుల అండతో టిడిపి వారు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. రైతులు వద్ద పొగాకు, మిర్చి, అపరాలు కొనే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. టమాట ఎక్కువగా పండిన ప్రాంతంలో గిట్టుబాటు ధర లేక రైతులు టమాట ను రోడ్లపై పారబోస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు. రైతులకు స్థిరీకరణ నిధి లేకుండా చేయటం దుర్మార్గమన్నారు. ఆనాడు వైసిపి ప్రభుత్వంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలను కొనుగోలు చేయడం జరిగిందని, ఆనాడు మిర్చి ధర 25 వేల నుండి 30 వేల వరకు టన్ను ధర పలికిందన్నారు. రైతులు పలు రూపాల్లో అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసుకుంటున్నది అన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తాను క్యాబినెట్ హోదా, చీప్ విప్ అంటూ గొప్పలు చెప్పుకుంటూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన సొంత కంపెనీలకు చెందిన ఎరువులనే తీసుకువెళ్లాలని ఆయా డీలర్ల పై ఒత్తిడి చేస్తున్నారని బొల్లా ఆరోపించారు. ప్రతిరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నిందలు వేయడమే తప్ప మరొకటి లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పై ఘాటు విమర్శలు చేశారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బందిని భయపెట్టి కూటమి నేతలు రైతు భరోసా కేంద్రాలను, హెల్త్ సెంటర్లను తమ ఆధీనంలోకి తీసుకొని ఎరువులు, ఆసుపత్రి మందులు బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇక గ్రామాల్లో మద్యం ఇంటింటికి సరఫరా జరుగుతున్నదని, రేషన్ దుకాణం దారులు అక్కడక్కడ రేషన్ కు బదులు మద్యం సీసాలు ఇస్తున్నారని, పలువురు తమ దృష్టికి తెచ్చారని, ఇది కూటమి ప్రభుత్వం కు సిగ్గుచేటు అన్నారు. వైసిపి హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వగా ఐదు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ పూర్తయ్యాయని, పిడుగురాళ్లలో, పులివెందులలో పూర్తిస్థాయిలో పూర్తయ్యాయని. నేడు ముఖ్యమంత్రి తమ వారికి కట్టబెట్టేందుకు ప్రైవేటుపరం చేశారని బ్రహ్మనాయుడు విమర్శించారు. ఇక శావల్యాపురం మండల పరిధిలో , ట్రాక్టర్లు టైర్లు చెడిపోయి బాగు చేసుకుంటున్నా, పోలీసులు వచ్చి డ్రైవర్లపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళుతున్నారని, ఇక గ్రామాలలో జరిగే ప్రతి కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకోవాలని శావల్యాపురం, ఈపూరు ఎస్సైలు, హుకుం జారీ చేస్తున్నారని బొల్లా ఆగ్రహించారు. ఇక స్థానిక ఎన్ ఎస్ పి స్థలంలో తన హయాంలో వంద పడకల ఆసుపత్రికి నాబార్డు నిధులు కూడా మంజూరయ్యాయని, నేడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఇక పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే 200 ఎకరాల సింగర చెరువు ఆక్రమణలతో 50 ఎకరాలకు కుషించుకుపోయిందని, తాను ఎమ్మెల్యేగా గెలవగానే ఆక్రమణలు తొలగించి రెండు వందల యాభై ఎకరాలు గా విస్తీర్ణపరిచి, నీటితో చెరువులను నింపుతూ ట్యాంకర్ల సంస్కృతి పాల ద్రోలి, కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేశామన్నారు. ఇక పట్టణంలో భూ కబ్జాలు ఎక్కువైపోయాయని, బెదిరించి పొలాలు, స్థలాలు తక్కువ రేట్లకు గుంజుకుంటున్నారని, అమ్మితే కొనుక్కోండి, అంతేకానీ బలవంతం గా బెదిరించి లాక్కో వద్దన్నారు. ఇక వరికపూడిసెల నిధుల గురించి పదేపదే చెబుతున్న పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు ఆనాటి వైసిపి ఎంపీగా ఉన్న విషయం నిధుల గురించి అప్పుడు మాట్లాడిన మాటలే ఇప్పుడు చెబుతున్నారన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు కే.కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, కే.దేవరాజ్, పగడాల వెంకటరామిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.(Storty :సూపర్ సిక్స్ సంబరాలు కాదు అటు రైతులు సమస్య చూడండయ్యా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version