రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యం
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని చేకూరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వనపర్తి జిల్లాలోని ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి పోలీస్ శాఖ ద్వారా ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికను చదివి వినిపించారు.వేదికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వర రావు ఉపస్థితులయ్యారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు వివిధ శాఖల జిల్లా అధికారులకు, శాంతిభద్రతల నిర్వహణలో అహర్నిశలు కృషిచేస్తున్న జిల్లా ఎస్పీ మరియు పోలీస్ యంత్రాంగానికి, పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి, నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ అందరికి మరొక్కసారి “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.(story : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యం)

