20న శ్రీ రామాయణ శంఖారావం
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంశ్రీమద్రామాయణ ప్రాంగణంలో సెప్టెంబర్ 20వ తేదీన శ్రీ రామాయణ శంఖారావం కార్యక్రమంలో భాగంగా జాతీయస్థాయి లీగల్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నామని ఎన్ సి ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు .వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడుతూ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటుచేసిన సదస్సుకు తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ కే లక్ష్మణ్ ,జస్టిస్ టీ మాధవి దేవి ,జస్టిస్ ఎస్ నంద ,తిరుపతి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి ఎస్ ఆర్ కృష్ణమూర్తి ,దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్య ప్రకాష్ రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు .ఈ సమావేశంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ హెచ్ లజపతిరాయ్ ,కోఆర్డినేటర్ నారాయణం గౌరీ నిత్య ,తవాస్మి అకాడమీ శ్రీరామ చక్రధర్ ,డైరెక్టర్లు శారదా దీప్తి ,జాహ్నవి రెడ్డి, మేనేజర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. (Story:20న శ్రీ రామాయణ శంఖారావం)

