బీసీల పార్టీ ఏర్పాటుకు సంఘీభావం
న్యూస్‌తెలుగు/వనపర్తి : తాజ్ కృష్ణ హోటల్లో తీన్మార్ మల్లన్న బీసీల పార్టీ ఏర్పాటుకు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ బృందం ఆహ్వానిస్తే వెళ్లారు. తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయంతో బీసీ జేఏసీ సంస్థను రాజకీయ పార్టీగా మార్పు చేసే క్రమంలో ఈరోజు తాజ్ కృష్ణ హోటల్ లో రాజకీయ పార్టీని ప్రకటించేoదుకు నిర్ణయించుకొని ముఖ్య నేతలు, మేధావుల సమక్షంలో తాజ్ కృష్ణ హోటల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వనపర్తి నుండి ఆహ్వానం పంపారు వారి విన్నపాన్ని మన్నించి తాజ్ కృష్ణ హోటల్ కి వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు తీన్మార్ మల్లన్న వనపర్తి జిల్లా టీం సభ్యులు విజయ్ యాదవ్, మాధవ సేవే మాధవ సేవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, సాగర్, బాబురావు, మోహన్ రావు, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. (Story:బీసీల పార్టీ ఏర్పాటుకు సంఘీభావం)

