నారి స్వశక్తి కుటుంబ అభియాన్
న్యూస్ తెలుగు / చింతూరు : చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం నారీ స్వశక్తి కుటుంబ అభియాన్ కార్యక్రమం డాక్టర్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్నెంట్ డాక్టర్ కోటిరెడ్డి సిబ్బందితో ఆధునిక యుగంలో మహిళలకు వస్తున్న వ్యాధులు వాటి నివారణ గూర్చి, సోదాహరణంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్వశక్తి అభియాన్ కార్యక్రమం ఈనెల 17వ నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగా ప్రతి మహిళ తన ఆరోగ్యం కాపాడుకుంటామని, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటామని, ఆరోగ్యమైన జీవనశైలిని అనుసరించేందుకు ఇతరులను కూడా ప్రోత్సహిస్తామని, ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, ఆనందకరమైన కుటుంబాన్ని నిర్మించడంలో తన వంతు కృషి చేస్తామని సిబ్బందిచే నారి స్వశక్తి కుటుంబ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి, డాక్టర్లు, సిబ్బంది తోపాటు, బిజెపి మండల మాజీ అధ్యక్షులు డివిఎస్ఎస్ రమణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. (Story:నారి స్వశక్తి కుటుంబ అభియాన్)

