Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ‌లో ఘ‌నంగా మోడీ 75వ జన్మదిన వేడుకలు

వినుకొండ‌లో ఘ‌నంగా మోడీ 75వ జన్మదిన వేడుకలు

0

వినుకొండ‌లో ఘ‌నంగా మోడీ 75వ జన్మదిన వేడుకలు

న్యూస్ తెలుగు /వినుకొండ : భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు సేవా పక్వాడ్ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశానుసారం పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ సూచనల మేరకు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సేవా పక్వాడ్ కన్వీనర్ కట్టా సుబ్బారావు, వినుకొండ పట్టణ సేవా పక్వాడ్ ఇన్చార్జ్ గుడిపాటి చంద్రశేఖర్ పర్యవేక్షణలో వినుకొండ పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణ శాఖ తరపున నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా బుధవారం ఉదయం పట్టణంలోని పోలేరమ్మ దేవాలయం వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవీఎస్ ఆంజనేయులు, జి డి సి సి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారికి వినుకొండ పట్టణ శాఖ తరపున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని తరువాత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ సేవా పక్వాడ్ ఇంచార్జ్ గుడిపాటి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్, సేవా పక్వాడ్ కన్వీనర్ నారిశెట్టి మహేష్, కో కన్వీనర్ లాయర్ తిలక్ నాయక్, మాజీ అధ్యక్షులు నల్లూరి వీరరాఘవులు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్, మాజీ కో కన్వీనర్ ఎం వి అప్పారావు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్, సీనియర్ కార్యకర్తలైన సుధా, గణేష్, పాలడుగురాజు, బండి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, గర్రె రామచంద్రరావు, పంచుమర్తి శంకర్, వేములపాటి సుబ్బారావు, దేవతి చిన నరసింహారావు, మధు అయోధ్య, దోసపాటి గాంధీ, పత్తి మణికంఠ నాయుడు, అంజయ్యకోట, కామేశ్వరరావు, ఆయంచి గిరి, ఆచారి, పార్థసారథి, గాజుల మస్తాన్ రావు, రాచపూడి వంశీ, ఇంకా బిజెపి కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రముఖులు అడ్డగిరి రాంబాబు, గుడివాడ మల్లికార్జున రెడ్డి, రమేష్, పెండ్యాల సురేష్ బాబు, చీమకుర్తి శ్రీనివాసరావు రెడ్డి, కోటేశ్వరరావు, జయవరపు కృష్ణ, మేడం శంకర్, టిడిపి నాయకులు పివి సురేష్ బాబు, పత్తి పూర్ణ, పువ్వాడ నాగేశ్వరరావు, పోలేరమ్మ దేవస్థానం మహిళా సభ్యులు నల్లూరి పద్మ, మహిళా బృందం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. (Story:వినుకొండ‌లో ఘ‌నంగా మోడీ 75వ జన్మదిన వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version