యజ్ఞం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హజరైయ్యారు.అనంతరం వనపర్తి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు గన్నోజు మోహనాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… మహిళలు స్వశక్తితో ఎదగాలని కోరుకున్నారు. మాజీ మంత్రిగారి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలస రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ, ఉంగలం తిరుమల్, వనపర్తి పట్టణ బులియన్ మర్చంట్ అధ్యక్షులు బంగారు, అనిల్, కుమార్, ప్రధాన కార్యదర్శి వేణు చారి, ఆలయ కమిటీ అధ్యక్షులు యాదాచారి, సత్యనారాయణ తదితరులు, పాల్గొన్నారు.(Story : యజ్ఞం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి )

