Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో పొలం పిలుస్తుంది

వినుకొండలో పొలం పిలుస్తుంది

0

వినుకొండలో పొలం పిలుస్తుంది

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని గోకనకొండ, నాగులవరం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి జి .వరలక్ష్మి మాట్లాడుతూ. రైతు సోదరులు వరి నారుమడి పీకే వారం ముందు కార్బో పూర్రాన్ 3g గుళికలు సెంటుకి 160 గ్రాములు పలుచుగా నీరు పెట్టి చల్లాలని తద్వారా నాటిన 30 రోజుల వరకు చీడపీడల ఉధృతి అరికట్టవచ్చని తెలిపారు. కవులు రైతులు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందటానికి సి. సి. ఆర్ .సి. కార్డు పొంది పంట నమోదు చేయించుకొని గ్రామ రైతు సేవ కేంద్ర సిబ్బంది లాగిన్ లో నమోదు చేయించుకోవాలని తెలిపారు. రైతు సోదరులు యూరియా గూర్చి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పంటలకు కావలసిన యూరియా అందుబాటులో ఉన్నదని ఒకసారి పంటకు వేయవలసిన యూరియా మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆరిఫ్, వి. ఏ. ఏ చాందిని, రైతు సోదరులు పాల్గొన్నారు.(Story:వినుకొండలో పొలం పిలుస్తుంది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version