Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి

పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి

0

పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి

గుర్రం జాషువా జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్

న్యూస్ తెలుగు/వినుకొండ : సాహితి చరిత్రలో సామాజిక రుగ్మాతలపై పోరాటం చేసిన మహాకవి, తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని గుర్రం జాషువా జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయకుమార్ అన్నారు. స్థానిక విజయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ. సాహిత్య ని ఆయుధంగా చేసుకొని తెలుగు సమాజాన్ని మేలుకొలిపిన గుర్రం జాషువా పేరుని పల్నాడు జిల్లాపెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలను కలుపుకొని గుర్రం జాషువా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరో కార్యచరణకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగా 19 తారీకు వినుకొండలో, 22 చిలకలూరిపేటలో, 25 మాచర్ల, గురజాల నియోజకవర్గాలలో కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, అనంతరం జాషువా జయంతిని పరిష్కరించుకొని, జాషువా పుట్టిన గడ్డ చాట్రగడ్డపాడు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేపడతామని, ఈ సందర్భంగా ఆయా స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అడ్వకేట్ వంకాయలపాటి రవి, అడ్వకేట్ మల్లెల అశోక్, పూనూరి కృష్ణకుమారి రెడ్డి, పిడతల రమాదేవి, బీసీ టౌన్ ప్రెసిడెంట్ కొల్లిపర బాలాజీ, బీసీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ సుతారం విశ్వేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ ఎస్ ఉమ్మడి గుంటూరుజిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య, ఐ ఎన్ డి సి ఎఫ్ జిల్లా అధ్యక్షులు తలారి నాని, పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.(Story:పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version