మాజీ ఎమ్మెల్యే పొగాకు అయ్యప్ప
14వ వర్ధంతి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కొత్తకోటలోని అయ్యప్ప చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఆయన తమ్ముడు పొగాకు విశ్వేశ్వర్ మరియు పలు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ వనపర్తి అసెంబ్లీ ఏర్పడిన నాటినుండి ఎమ్మెల్యేలలో మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యే లాగా వనపర్తి లో గెలిచిన ఘనత అయ్యప్ప గారీదని వారి దారిలో జయరాములు , డాక్టర్ బాలకృష్ణ మాత్రమే బీసీ ఎమ్మెల్యేలుగా గెలిచారని కనుక వీరి మార్గంలో బీ.సీ లంతా ఏకమై రాబోవు ఎలక్షన్లలో బీసీ ఎమ్మెల్యేలు కావాలని ఆకాంక్షిస్తున్నాననీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొని పొగాకు అయ్యప్ప విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. (Story:మాజీ ఎమ్మెల్యే పొగాకు అయ్యప్ప 14వ వర్ధంతి)
