Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సీతంలో 58వ ఇంజనీర్ల దినోత్సవ వేడుకలు

సీతంలో 58వ ఇంజనీర్ల దినోత్సవ వేడుకలు

సీతంలో 58వ ఇంజనీర్ల దినోత్సవ వేడుకలు

న్యూస్ తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధి లో గల సీతం కళాశాలలో 58వ ఇంజనీర్ల దినోత్సవంసోమవారం నిర్వహించారు. భారత రత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు నివాళులర్పిస్తూ డీప్ టెక్ & ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ – డ్రైవింగ్ ఇండియాస్ టెకేడ్ అనే థీమ్‌తో ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డాక్టర్ కె. రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.సుస్థిర ఇంజనీరింగ్ ఆచరణల పై ఆయన చేసిన ప్రసంగం విద్యార్థులను విశేషంగా ఆకర్షించింది. ఇందులో భాగంగా సుస్థిర అభివృద్ధి కొరకు అధిక నాణ్యత, అధిక పరిమాణం కలిగిన ఫ్లై యాష్ కాంక్రీట్”* పై ప్రదర్శన తో గ్రీన్ టెక్నాలజీ మరియు సుస్థిర అభివృద్ధి యొక్క ప్రాధాన్యతను విద్యార్ధులకు వివరించారు.ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జి. రవికిశోర్ మాట్లాడుతూ వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఇంజనీర్ల బాధ్యతలు, పాత్రలపై ఆయన విద్యార్థులకు స్పష్టతనిచ్చారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వి. రామమూర్తి విద్యార్థులను సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంతో ఇంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కోవాలని పేర్కొన్నారు.సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు సర్‌ విశ్వేశ్వరయ్య వారసత్వాన్ని స్మరించుకొని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, అంకితభావం, కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్పో లో వివిధ విభాగాల విద్యార్థులు ప్రాజెక్టులు, వర్కింగ్ మోడల్స్‌ ను ప్రదర్శించారు. ఉత్తమ ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్ధులకు కళాశాల యాజమాన్యం బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్. వెంకటలక్ష్మి వివిధ విభాగాధిపతిలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.(Story :సీతంలో 58వ ఇంజనీర్ల దినోత్సవ వేడుకలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!