సమాజాభివృద్ధికి కవులు,రచయితలు పాటుపడాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : సమాజాభివృద్ధికి, నీతివంతమైన వ్యవస్థకు రచయితలు, కవులు,కళాకారులు పాటుపడాలని తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు వల్లాభపురం జనార్ధన్ అన్నారు .శనివారం వనపర్తి పట్టణంలో టీఎన్జీవో భవనంలో కవులు,రచయితలు రచించిన 2025 డైరక్టర్ ఉమ్మడి జిల్లా పుస్తకావిష్కరణ మరియు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పై కవి సమ్మేళనము నిర్వహించారు. ఈ సమ్మేళనానికి తెలంగాణ సాహితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా2025 డైరక్టర్ ఉమ్మడి జిల్లా కవులు, రచయితల సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో పలువురు వక్తలు మాట్లాడారు. తెలంగాణ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పి.శంకర్ గౌడ్, ప్రముఖ కవులు జనజ్వాల,డా.వీరయ్య , వహీద్ ఖాన్,ఖాజా మైనోద్దీన్,వా గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ సమాజ హితం కోసం ప్రజల పక్షాన ఉంటూ తమ రచనలు,పాటలు వినిపించాలని అభిప్రాయపడ్డారు.కనుమరుగవుతున్న కళాకారుల, రచయితలను వెలికి తీసి పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.వీరతెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది రైతులు, శ్రామికులు తమ ప్రాణాలు అర్పించారని, ఈ సందర్భంగా కవితలతో రైతులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 30 మంది కవులకు కళాకారులకు శాలువులతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంస్కృతిక కేంద్రము జిల్లా కన్వీనర్ అయోధ్య రాముడు, టి ఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్ గౌడ్,కవులు కంటే నిరంజన్ కొప్పుల యాదయ్య, ప్రమోద్,బి.నరేందర్, గంధం నాగరాజు ,బైరోజ్ చంద్రశేఖర్,డా. శ్యాంసుందర్ బి. సుధాకర్ ఆచారి,మీసాలరాము, కిరణ్ కుమార్, సురేష్ పాల్గొన్నారు.(Story:సమాజాభివృద్ధికి కవులు,రచయితలు పాటుపడాలి)
