Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ లో పొలం పిలుస్తుంది..

వినుకొండ లో పొలం పిలుస్తుంది..

0

వినుకొండ లో పొలం పిలుస్తుంది..

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, చీకటి గలపాలెం రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులకు యూరియా మరియు డి. ఏ. పి. ఎరువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఇందులో భాగంగా ఏవో వరలక్ష్మి మాట్లాడుతూ. రైతులు పంటకు ఒకసారి వేయవలసిన ఎరువులు మాత్రమే కొనుగోలు చేయాలని, సీజన్ కు మొత్తం కావలసిన ఎరువులు తీసుకోవద్దని, రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు. రెండవ దఫా నేనో యూరియా పిచికారి చేసుకోవచ్చని తద్వారా వాతావరణం కాలుష్యం నివారించవచ్చని వృధా అని అరికట్టవచ్చని తెలిపారు. పంట వేసిన ప్రతి రైతు ఈ పంటలో నమోదు చేయించుకోవాలని అన్నారు. కౌలు రైతులకు సి సి ఆర్ సి పొంది పంట నమోదు చేయించుకొనిన యెడల అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులని గ్రామ రైతు సేవ కేంద్రం సిబ్బంది ద్వారా నమోదు చేయించుకోవాలని అన్నారు. గౌరవ కలెక్టర్ పల్నాడు వారి ఆదేశాల ప్రకారం పొగాకు పంట సాగు చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆరీప్, యశ్వంత్, పురుషోత్తం రెడ్డి రైతు సోదరులు పాల్గొన్నారు.(Story:వినుకొండ లో పొలం పిలుస్తుంది..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version