Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌16న డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ

16న డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ

16న డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ

పల్నాడుకు కోడెల సేవల్ని స్మరించుకునే అరుదైన సందర్భం

భారీగా తరలి రావాలని చీఫ్‌ విప్ కార్యాలయం పిలుపు

న్యూస్ తెలుగు /వినుకొండ : పల్నాడు ప్రాంతానికే ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చిన మాజీ సభాపతి, మాజీమంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేగా, వివిధ శాఖల మంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా సెప్టెంబర్ 16 కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా వినుకొండలోని ఎన్‌ఎస్‌పీ మైదానంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపారు. ఆ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. పల్నాడు ప్రాంతానికే కాక ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసిన అరుదైన వ్యక్తి కోడెల అని, ఆయన స్థానిక ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధికి సూచికగా విగ్రహ ఆవిష్కరణకు అంతా భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ, సామాజిక, వైద్య రంగాలలో కోడెల సేవలు, పల్నాడు జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి పోతుందని ఆ స్మృతులకు గౌరవంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి అయ్యన్నతో పాటు పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అహ్మద్ షరీఫ్, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.(Story:16న డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments