Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

0

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

న్యూస్ తెలుగు/ చింతూరు : మోడీ చిత్రపటానికి బిజెపి జిల్లా మాజీ కార్యదర్శి పాయం వెంకయ్య, చింతూరు మండల మాజీ అధ్యక్షులు డివిఎస్ రమణారెడ్డి( చిట్టిబాబు ) మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల మీద సి ఎస్ టి తగ్గించి నందుకు గాను పాలాభిషేకం నిర్వహించారు. సిఎస్టి తగ్గించి పేద ప్రజలకు బిజెపి ప్రభుత్వం మరింత చేరువైందని ఈ సందర్భంగా పాయం వెంకయ్య అన్నారు. నిత్యవసర వస్తువుల మీద ధరలు తగ్గటంతో పేద ప్రజలకు ఊరట కలిగిందని పేర్కొన్నారు. వీటితోపాటు వ్యవసాయ ఎరువులు, పనిముట్లు, రైతులకు కావలసిన అన్ని రకాల పనిముట్లు, వైద్య రంగానికి సంబంధించిన మందుల ధరలు ఈనెల 22 నుంచి తగ్గనున్నాయని రాష్ట్రంలో అన్నిటి మీద ఉన్న పన్నులు తగ్గించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రత్యేక ప్రణాళిక ద్వారా గొప్ప నిర్ణయం తీసుకున్నారని నిర్ణయం పట్ల తాము హర్షం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే మూడో స్థానానికి ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందిందని తెలిపారు. రక్షణ రంగంలో దేశాన్ని ప్రపంచ అగ్రభాగాన నిలపటం ద్వారా భారత ప్రజలు గర్వంగా తల ఎత్తుకొని చెప్పుకునే స్థాయికి ఎదిగా రన్నారు. బిజెపి,యన్ ఏ ప్రభుత్వం రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలతో పాటు పోలవరం నిర్వాసితులకు పూర్తి ప్యాకేజీ అందివ్వ నుందని పేర్కొన్నారు. చిట్టిబాబు మాట్లాడుతూ చింతూరు కేంద్రంగా వంద పడకల ఆసుపత్రి మంజూరు జరిగిందని త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, శ్రీను, మానే వీరబాబు, లక్ష్మి, విశ్వనాధ్, మానిజయ, తెలుగుదేశం నాయకులుపొదిలి రామారావు తదితరులు పాల్గొన్నారు.(Story:మోడీ చిత్రపటానికి పాలాభిషేకం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version