స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోండి
న్యూస్ తెలుగు/చింతూరు : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సరికొత్తగా పంపించబడిన స్మార్ట్ రేషన్ కార్డు లను తహసిల్దార్ సయ్యద్ హుస్సేన్, చింతూరు సర్పంచ్ కారం కన్నారావు ఆధ్వర్యంలో బుధవారం చింతూరు సచివాలయంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా చింతూరు మండల టిడిపి అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ- రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి చేయడం జరిగిందని చింతూరు డిపోకు 1146 స్మార్ట్ కార్డులు రావడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశ పెట్టిందనీ అన్నారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి స్మార్ట్ కార్డులు రూపొందించినట్లు తెలిపారు. ప్రతి కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుందని , కార్డు ద్వారా రేషన్ తీసుకున్న వెంటనే రాష్ట్ర , జిల్లా స్థాయిలో అధికారులకు సమాచారం అందేలా వ్యవస్థను ” ప్రభుత్వం తయారు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ఇలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రేషన్ పంపిణీలో పారదర్శకత, సమర్థత పెంచడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఆమల, వైస్ ఎంపీపీ చిన్ని, మాజీ మండల అధ్యక్షులు ఎండి జహంగీర్, మాజీ మండలాధ్యక్షుడు ఇల్లాచిన్నరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు పి. సాల్మన్ రాజు, మహిళ నాయకురాలు మంగవేణి, తెలుగుదేశం నాయకులు, ఆసిఫ్, రామారావు, ఓ నరసింహారావు, సురేష్ చౌదరి, కూటమి నాయకులు బంగారు లక్ష్మణ్, చిట్టి బాబు తమ్మినెడి రామారావు మడివి రాజు, కాంగ్రెస్ నాయకులు అహమ్మద్ అలీ, ఎండి హబీబ్, సిపిఎం నాయకులు పల్లపు వెంకట్, విఆర్ఓ రామచందర్రావు, కార్యదర్శి జగన్ తదితరులు పాల్గొన్నారు.(Story :స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోండి)

