రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలలకు బీరువా పుస్తకాలు పంపిణీ
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రార్థనచేసే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మదర్ థెరెసా స్ఫూర్తితో వినుకొండ ప్రాంత విద్యారంగానికి దశాబ్ద కాలం పైగా సేవలందిస్తున్న గాండ్ల నాగేంద్రుడు మాష్టారు సమాజానికి ఆదర్శ ప్రాయులని రోటరీ క్లబ్ వినుకొండ అధ్యక్షులు యేరువ వెంకట నారాయణ అన్నారు. స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈపూరు మండలంలోని కొచ్చెర్ల ప్రాధమిక పాఠశాలకు ఆఫీస్ బీరువా , మరియు బోడేపూడివారిపాలెం ఆర్ సి ఎం ప్రాధమిక పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు మరియు స్టేషనరీ ని బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని తన తల్లి తండ్రులు స్వర్గీయ గాండ్ల మూల సుబ్బయ్య – చెంచమ్మల జ్ఞాపకార్ధం విశ్రాంత ఉపాధ్యాయులు గాండ్ల నాగేంద్రుడు – లక్ష్మి సామ్రాజ్యం దంపతులు బహుకరించారు . ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా ముఖ్యులు అలా శ్రీనివాసరావు, ముత్తినేని గిరిబాబు , మాజీ అధ్యక్ష , కార్యదర్సులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి , గుత్తా గురునాధం , క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కూచి రామాంజనేయులు , రోటరీ ఫౌండేషన్ డైరెక్టర్ షేక్ మస్తాన్ , క్లబ్ సభ్యులు దావులూరి శ్రీనివాసరావు , నుసుము రాజశేఖర్ రెడ్డి దాత గాండ్ల నాగేంద్రుడు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తమ పాఠశాలలకు రోటరీ సేవలు విస్తరించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.(Story :రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలలకు బీరువా పుస్తకాలు పంపిణీ )

