పల్నాడు జిల్లా రైతుల్ని యూరియా కష్టాల నుండి కాపాడండి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక తాహాసిల్దారు ఆఫీసు వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినుకొండ నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో సోమవారం యూరియా కొరతపై వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి వెనిగండ్ల బాలాజీ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. పల్నాడు జిల్లాలో యూరియా కొరత బాగా ఉందని, రైతులు షాపుల వద్దకు వెళ్లి యూరియా కావాలని అడిగితే స్టాక్ లేదని ఎరువులు కొట్లు వారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వినుకొండ ప్రాంతంలో యూరియా కొరత బాగా ఉందని రైతులు చెప్తున్నారన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వినుకొండ పై వివక్షత చూపుతున్నాడని వినుకొండ కి యూరియా ఇవ్వట్లేదని చెప్తున్నారు. కాగితాల పైన, స్టాక్ ఉన్నట్టు చూపిస్తున్నారని, ఎప్పుడో చనిపోయిన షాపు యజమానులపై స్టాక్ చూపిస్తూ ఆ వంకతో వినుకొండ కి యూరియా ఇవ్వట్లేదని పలువురు చెప్తున్నారు. వెంటనే జిల్లా వ్యవసాయ అధికారి జోక్యం చేసుకుని యూరియాని అందరికీ అందే విధంగా చూడాలని, లేనిచో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల చే జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని ముట్టడి చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో రైతుకు కావాల్సిన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉండే విధంగా చూడాలని, రైతులకు కావాల్సిన విత్తనాలు సబ్సిడీపై అందే విధంగా చూడాలని రైతులకు వ్యవసాయ రుణాలను ఇబ్బంది లేకుండా రెన్యువల్ చేయాలని, కౌలు రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందించాలని, ముఖ్యంగా పొగాకు రైతులు 2024 – 2025 సంవత్సరంలో ఒక కంపెనీల ఆదేశాల మేరకు వారి పరివేక్షణలో పండించిన పొగాకును చెక్కులు తొక్కుకోండి క్రాసింగ్ కి పిలుస్తామని పిలవకుండా నాలుగైదు మాసాలు ఇబ్బంది పెట్టిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ ఏడాది ఎగుమతి లేదని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పొగాకును వెయ్యొద్దు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని ప్రభుత్వాలు చెప్తుంటే ఏదైతే పొగాకు కంపెనీల వారు మీరు పొగాకు సాగు చేయండి మీకు మేము బాండ్లు ఇస్తాం అని వచ్చి రైతుల్ని మభ్యపెడుతున్నారని. ప్రభుత్వం వద్దు అన్న తర్వాత వీళ్ళు బాండ్లు ఇస్తే రైతులు సాగు చేస్తే ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతుల మొర ఆలకించే వారెవరు, వెంటనే సంబంధించిన పొగాకు కంపెనీల యజమానులతో ప్రభుత్వ అధికారులు చర్చించి వారిచ్చిన బాండ్ ప్రకారం వారు కట్టు బడి ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకొని లేకుండా రైతులు పండించే పొగాకును వారు చివరి వరకు కొనుగోలు చేసే విధంగా చూడాలని, డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, పలు అంశాలపై రాము రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినుకొండ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వెనిగండ్ల బాలాజీ, కాకర్ల కొండలు, రైతు నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, ముట్లూరి బాలస్వామి, తోట నరసింహారావు, వెంకటరత్నం, మల్లయ్య, సుబ్బరాయుడు, లక్ష్మి, మల్లేశ్వరి, రమణ, చిన్న, పెద్దారావు, వెంకటేశ్వర్లు, రాంబాబు, కొండలరావు, నాగేశ్వరరావు, భాష, చెన్నకేశవులు, దాదా తాతయ్య, నాయకులు పాల్గొన్నారు.(Story : పల్నాడు జిల్లా రైతుల్ని యూరియా కష్టాల నుండి కాపాడండి )

