కూర్మరాజుపేట యూరియా పంపిణీ
న్యూస్ తెలుగు /సాలూరు సెప్టెంబర్ 8 : సాలూరు మండలం, కూర్మరాజుపేట గ్రామంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన సాలూరు ఏ డి ఏ సత్యవతి, తాహ ఓసిల్దార్ నీలకంఠరావు,, ఏ ఓ కే శిరీష గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి యూరియా ఏ విధంగా రైతులకు పంపిణీ జరుగుతుందో పరిశీలించారు. అనంతరం యూరియా స్టాక్ పాయింట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దని అందరికీ కావలసిన యూరియా త్వరలోనే వస్తుందని అందరికీ అందుబాటులో ఉంటుందని అన్నారు. రైతులు నానో యూరియా, నానో డిఎపిని వాడినట్లయితే ఖర్చులు తగ్గి అధిక దిగుబడి సాధించ వచ్చు నని తెలిపారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూర్మరాజుపేట వివోఏ సతీష్ కుమార్, వీఆర్వో రాము, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.(Story :కూర్మరాజుపేట యూరియా పంపిణీ )

