Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వ‌ర్యంలో గురువుల సత్కార సభ

రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వ‌ర్యంలో గురువుల సత్కార సభ

0

రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వ‌ర్యంలో గురువుల సత్కార సభ

న్యూస్ తెలుగు/వినుకొండ : బోధనేతర పనుల భారం కొంత ఉన్నప్పటికీ విద్యా విషయాలపట్ల అశ్రద్ధ వహించకుండా విద్యార్థులను తీర్చి దిద్దటంలో గురువులందరు శ్రమిస్తున్నారని, అటువంటి గురువులను సత్కరించటం సముచితమని, ఈ ఉపాధ్యా దినోత్సవ వేళ అటువంటి కార్యక్రమాన్ని ఆహ్లాద భరిత వాతావరణం లో నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ వారు అభినందనీయులని సీనియర్ మండల విద్యాశాఖాధికారి సయ్యద్ జఫ్రుల్లా అన్నారు. స్థానిక జాషువ కళా ప్రాంగణంలో శుక్రవారం రాత్రి రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన గురువుల సత్కార సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు యేరువ వెంకట నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో 13 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సభకు మరో ముఖ్య అతిధి గా హాజరైన మున్సిపల్ చైర్మన్ సతీమణి, కౌన్సిలర్ షేక్ షకీలా మాట్లాడుతూ.. మనిషి ఉన్నతంగా ఎదగడంలో గురువు పాత్ర ప్రముఖమని, అటువంటి గురువులు ఎందరో తాను ఈ స్థితికి చేరుకోవడంలో మార్గదర్శకులు అయ్యారని అన్నారు. ఈ సభలో నియోజక వర్గంలోని వివిధ పాఠశాలలకు సంబంధించిన 13 ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సత్కారం అందుకున్నవారిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ టి. ప్రభాకరరావు , ఎం. రమాదేవి, ఎం. శ్రీనివాసరావు, డి.వి రామారావు, సి. హెచ్. చంద్ర శేఖర్ , పి. ఖాసింబీ , ఆర్. రాధా కృష్ణమూర్తి , విక్టోరియా రాణి , బి. హరియా నాయక్ , ఏ. సుజాత , జి. రవి, ఎం. రక్షణ, బి. వీరాస్వామి ఉన్నారు. సభలో రోటరీ కార్యదర్శి షేక్ బాజీ , కోశాధికారి పి. నవీన్ , రోటరీ జిల్లా ప్రముఖులు ఆలా శ్రీనివాసరావు , చిరుమామిళ్ల కోటేశ్వరరావు , ముత్తినేని గిరిబాబు , మాజీ అధ్యక్ష , కార్యదర్సులు గుమ్మా శ్రీ కాంత్ రెడ్డి, గుత్తా గురునాధం , రోటరీ ఫౌండేషన్ డైరెక్టర్ షేక్ మస్తాన్ , నాగేంద్రుడు మాష్టారు , ఉపాధ్యాయ నాయకులు బెజవాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు . రోటరీ జాయింట్ సెక్రటరీ సాదినేని శ్రీవాసరావు , మాజీ కోశాధికారి నాయబ్ రసూల్ , దావులూరి శ్రీనివాసరావు , గట్టుపల్లి యువప్రసాద్ తదితరులు సభలో పాల్గొన్నారు . సభాకార్యక్రమానికి వ్యాఖ్యాత గా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కూచి రామాంజనేయులు వ్యవహరించారు. (Story:రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వ‌ర్యంలో గురువుల సత్కార సభ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version