Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జీవాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జీవాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

0

జీవాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక జీవాలయం ఇంగ్లీష్ మీడియం నందు గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవ. ఫాదర్ గురుశ్రీ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలు ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల సౌరయ్య మాట్లాడుతూ. మన దేశ రెండవ రాష్ట్రపతి సర్ రాధాకృష్ణన్ పుట్టినరోజు 1888 సెప్టెంబర్ 5 ను ఉపాధ్యాయ దినోత్సవం గా 1962 నుండి జరుపుకుంటున్నామని, ఉపాధ్యాయులు, విద్యార్థులను విద్యా, నైతిక విలువలు చెప్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దు తున్నారు. తరగతి గదులలో దేశభవిష్యత్ ఆధార పడి ఉంటుందన్నారు. రాధాకృష్ణన్ ఒక తత్వ వేత్త, రాష్ట్రపతి గా మనదేశానికి వన్నె తెచ్చిన ఘనత వారిది. అలాంటి మహనీయుల మనం ఉండాలని అన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థిని, విద్యార్థులు నృత్యాలు, నాటికలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వారే ఒక రోజు ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పి ఆశ్చర్యపరిచారు. అనంతరం ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను దృశ్యాలువా పూలమాలలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరై అభినందనలు తెలిపారు. (Story:జీవాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version