సమాజ రూప రేఖల్ని మార్చే శక్తి ఉపాధ్యాయునిదే
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : సమాజ నిర్మాణం లో ఉపాధ్యాయ పాత్ర కీలకమని, ఉపాధ్యాయ పని వృత్తి కాదని, సమాజం రూపు రేఖలు మార్చే శక్తి యని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. అటువంటి ఉపాధ్యాయుల్నిసత్కరించుకోవడం మా బాధ్యత యని కలెక్టర్ తెలిపారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియం లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే ఉపాధ్యాయులు సమాజం లో గౌరవ ప్రదమైన వారని, వారిని సన్మానించు కోవడం మనందరి బాధ్యతయని పేర్కొన్నారు.
చీపురుపల్లి శాసన సభ్యులు కిమిడి కళా వెంకటరావు మాట్లాడుతూ ప్రపంచం లో గోప్పవారినందరిని తీర్చి దిద్దింది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ తో రాష్ట్రాన్ని సంక్షేమ, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ విద్యా శాఖామంత్రి గా అనేక సంస్కరణలను తీసుకు వచ్చారని, గతం లో లేని విధంగా విద్యా రంగం లో మార్పులు వచ్చాయని, పేదలు కూడా గొప్పగా చదువుకునే రోజులు వచ్చాయని తెలిపారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎం.ఎల్.సి గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం ఒక దినోత్సవాన్ని జరుపుకోవడం ఉపాధ్యాయులు గర్వ పడవలసిన విషయమన్నారు. ఉపాధ్యాయులు బోధనాంశాలతో పాటు నైతిక విలువలు, మన సంస్కృతీ, సంప్రదాయాల గురించి కూడా బోధించాలని తెలిపారు.
ఎం.ఎల్.సి డా. సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితం లో తల్లి దండ్రులతో పాటు ఉపాధ్యాయుని కూడా గుర్తు పెట్టుకుంటారని , అంతటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తియని అన్నారు. డి.సి.ఎం.ఎస్. చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణం లో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర వహిస్తున్నారని అన్నారు. డి.ఈ.ఓ మాణిక్యం నాయుడు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తల్లి దండ్రుల తర్వాత దైవంగా కొలిచే ఉపాధ్యాయుడు తరగతి గది లో పిల్లల భవిష్యత్తు ను తీర్చే బాధ్యత ను తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులైన 76 మందిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో సమగ్ర శిక్ష పి.ఓ డా. రామా రావు, డిప్యూటీ డి.ఈ.ఓ లు, ఎం.ఈ.ఓ లు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.(Story:సమాజ రూప రేఖల్ని మార్చే శక్తి ఉపాధ్యాయునిదే)
