Homeవార్తలుతెలంగాణమిలాద్ -ఉన్ - నబీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

మిలాద్ -ఉన్ – నబీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

మిలాద్ -ఉన్ – నబీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే మిలాద్- ఉన్ – నబీ వేడుకల్లో శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. వనపర్తి పట్టణం గాంధీ చౌక్ లో గల మహమ్మదీయ మజీదులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మిలాద్ – ఉన్ – నబీ ప్రత్యేకతను వివరించారు. మహమ్మద్ ప్రవక్త 1500 జయంతినే తో గొప్పగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనటి కృష్ణయ్య వనపర్తి మార్కెట్ డైరెక్టర్ లతీఫ్, ముస్లిం నాయకులు రఫిక్, మన్సూర్ , ఇర్ఫాన్, అస్లాం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.(Story : మిలాద్ -ఉన్ – నబీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!