Homeవార్తలుతెలంగాణఫుడ్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే

ఫుడ్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే

ఫుడ్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి పట్టణం పొట్టి శ్రీరాములు చౌరస్తాలో నరసింహ యాదవ్, రమేష్ యాదవ్ లు ఏర్పాటు చేసిన మనీ ఫుడ్ కోర్టును వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. దిన దిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇలాంటి వ్యాపార సముదాయాలు నెలకొల్పడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేసుకున్న నరసింహ యాదవ్, రమేష్ యాదవ్ లను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనటి కృష్ణయ్య అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:ఫుడ్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments