Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. హోమాలు

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. హోమాలు

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. హోమాలు

న్యూస్ తెలుగు/ వినుకొండ :పట్టణంలోని కొండ మెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఉత్సవాలు 9 వ రోజు సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి స్వామి వారికి పంచామృతములు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 40 దంపతులచే నవగ్రహ, లక్ష్మీ , గణపతి హోమాలు నిర్వహించారు. భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. సాయంత్రం గణనాధుని నిమజ్జన కార్యక్రమం, స్వామి వారి లడ్డూ ప్రసాదం వేలం పాట జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరూరి శ్రీనివాసరావు, పువ్వాడ సుబ్రహ్మణ్యం, అరవింద్, గుమ్మడి సదాశివరావు, చక్రధర్ లు తెలిపారు. (Story:#Site Title శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. హోమాలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!