Homeవార్తలుతెలంగాణపనసలపాడు గ్రామంలో కొత్త రేషన్ కార్డులు నమోదు కార్యక్రమం

పనసలపాడు గ్రామంలో కొత్త రేషన్ కార్డులు నమోదు కార్యక్రమం

పనసలపాడు గ్రామంలో కొత్త రేషన్ కార్డులు నమోదు కార్యక్రమం

న్యూస్ తెలుగు/ సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలసి పంచాయతీ పనసలపాడు గిరిజన గ్రామంలో ఈరోజు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ మరియు ఏ ఐ టి యు సి ఉమ్మడి జిల్లా నాయకులు బలగ రాదా ఆధ్వర్యంలో సచివాలయ సెక్రెటరీ శ్రీను మరియు సిబ్బంది సౌజన్యంతో ఈరోజు కొత్త రేషన్ కార్డులు నమోదు కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ సోమవారం పాచిపెంట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో పనసలపాడు గ్రామంలో కొంతమంది గిరిజనులకు రేషన్ కార్డ్స్ లేవని అందువలన అమాయకమైన ఆ గిరిజనులు ఎటువంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకోలేకపోతున్నారని కావున వారికి రేషన్ కార్డ్స్ చేయించి వారిని ఆదుకోవాలని ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వటం తో సదరు ఎంపీడీవో గారు వెంటనే స్పందించి ఆ గ్రామ సచివాలయ సెక్రెటరీ కే శ్రీనివాస్ గారికి చెప్పగా వారు ఈరోజు తమ సిబ్బందితో వచ్చి రేషన్ కార్డ్స్ లేక వారు పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకొని వెంటనే కొత్త రేషన్ కార్డ్స్ నమోదు చేయడం జరిగిందని అంతేకాకుండా కొంతమందికి ఉన్న రేషన్ కార్డ్స్ లో పిల్లల్ని కూడా యాడ్ చేయడం జరిగిందని బైబిల్ కేషన్ కూడా కొంతవరకు చేశారని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొన్ని డివైడెడ్ జరగబోయినప్పటికీ రేషన్ కార్డ్ సమస్య మాత్రం 90% పరిష్కారమైందని తెలిపారు అంతేకాకుండా పింఛన్లు సైటు ఇప్పుడు ఓపెన్ కాలేదు కాబట్టి ఎప్పుడు సైట్ ఓపెన్ అయితే అప్పుడు వెంటనే అర్హులైన వాళ్లకి పింఛనులు చేస్తామని మాటిచ్చారని తెలిపారు అంతేకాకుండా కొంతమందికి రేషన్ కార్డ్స్ యాడ్ చేయటానికి కొంతమందికి ఆధార్ కూడా లేనప్పటికీ రెండు రోజుల్లో పనసలు పాడు గ్రామంలో ఆధార్ సీడింగ్ సెంటర్ పెట్టి ఆధార్ లు కూడా చేయిస్తామని తెలిపారు అనంతరం గ్రీవెన్స్ కి వినతి పత్రం ఇచ్చిన రెండు రోజుల్లోనే ఎంపీడీవో గారు స్పందించి పనసలపాడు గిరిజనుల తెల్ల రేషన్ కార్డు సమస్యను పరిష్కరించినందుకు ఎంపీడీవో గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సచివాలయ సెక్రటరీ శ్రీను మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. (Story:పనసలపాడు గ్రామంలో కొత్త రేషన్ కార్డులు నమోదు కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!