Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో ఘనంగా వైయస్సార్ వర్ధంతి సభలు

వినుకొండలో ఘనంగా వైయస్సార్ వర్ధంతి సభలు

వినుకొండలో ఘనంగా వైయస్సార్ వర్ధంతి సభలు

అన్ని వర్గాల ప్రజల ఆరాధ్య దైవం వైయస్సార్
యూరియా అడిగితే జైల్లో వేస్తారట, కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బొల్లా ఆగ్రహం

న్యూస్ తెలుగు /వినుకొండ : మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సభలు ఘనంగా నిర్వహించారు. తొలుతగా వైసిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే మార్కాపురం రోడ్ లోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఎమ్మెస్ కే భాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో బొల్లా మాట్లాడుతూ. ప్రజా పాలన అంటే వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారని. ఆయన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పాడి పంటలతో కళకళలాడుతూ ఉండేవారన్నారు . ఆయన అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేసిన ఘనత వైయస్సార్ దేనని అన్నారు. విదేశీ విద్య ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో గుర్తుండి పోయాయన్నారు. తెలుగుప్రజలు ఉన్నంతవరకు వైయస్సార్ సంక్షేమ పథకాలు గుర్తుంటాయి అన్నారు. ఇక నేటి కూటమి పాలనపై బొల్లా ధ్వజమెత్తారు. రైతు పండించిన పంటకు కూలి ఖర్చులకు కూడా రాని దౌర్భాగ్య స్థితిలో రైతులు ఉన్నారని. రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తుంటే జైల్లో వేస్తామంటున్నారని. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చె నాయుడు చెప్పిన మాటలన్నీ బూటకమేనన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందున్నారని బొల్లా, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహించారు. అలాగే స్తానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నందు దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్.ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించిన అనంతరం రామగిరి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, సీనియర్ న్యాయవాది, పల్నాడు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ఎం ఎన్ ప్రసాద్, పగడాల వెంకటరామిరెడ్డి, కే కృష్ణారెడ్డి, దండు చెన్నయ్య, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story:వినుకొండలో ఘనంగా వైయస్సార్ వర్ధంతి సభలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!