స్వామి వివేకానంద బోధనలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

న్యూస్ తెలుగు /సాలూరు : స్వామి వివేకానంద మాటలు ఆయన బోధనలు, ఆలోచనలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ మరియు గిరిగిన శాఖామాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు, సోమవారం సాలూరు మున్సిపాలిటీ 3వ వార్డ్‌లో స్వామి వివేకానంద విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్ పి భంజ్ దేవ్ తో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆయన బోధనలు, ఆలోచనలు నేటి సమాజానికి దారిదీపంలాంటివి. యువత ఆయన ఆచరణలో పెట్టిన విలువలను అనుసరించి దేశ నిర్మాణంలో ముందడుగు వేయాలి” అన్నారు. మాజీ ఎమ్మెల్యే బంజ్ దేవ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా వివేకానంద ఆలోచనలతో ముందుకు వెళ్లి భవిష్యత్తులో రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలవాలని యువతకు పిలిపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రంభ రజినీకాంత్ , కొల్లి గిరిధర్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు, పప్పల మోహన్ రావు, కేతిరెడ్డి చంద్ర, పేర్ల విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.(Story:స్వామి వివేకానంద బోధనలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి)