చంద్రబాబు 50 ఏళ్ల ప్రజాజీవితం నిజాయతీకి నిలువుటద్దం
అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబుకి పోటీ లేరు, రాలేరు..
రాష్ట్రంలో త్వరలోనే 10 లక్షలమందికి కొత్త పింఛన్లు
వినుకొండ పింఛన్ల పంపిణీలో చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : సీఎం చంద్రబాబు 50 ఏళ్ల సుదీర్ఘ ప్రజాజీవితం ఆదర్శమని, నీతి నిజాయతీలకు నిలువుటద్దం, ఆయనకు సాటి లేరు, వేరెవరూ రాలేరని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనే యులు అన్నారు. తొలిసారి సీఎంగా బాధ్యతలు తీసుకుని 30 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని తరచి చూస్తే సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా నిలిచారని కొనియాడారు. త్వరలోనే సుమారు 10 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వినుకొండ ఒకటో వార్డు సిద్ధార్థ నగర్‌లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు. అనంతరం జీవి మాట్లాడుతూ చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని , అప్పట్నుంచీ ప్రజా జీవితంలో అరుదైన ఆదర్శ సీఎంగా దేశంలోనే నిలిచారన్నారు . మహిళలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో సముచిత అవకాశాలు ఇచ్చారని, రాజకీయాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించారన్నారు. దేశంలో డ్వాక్రా సంఘాలను ప్రారంభించిన తొలి సీఎం చంద్రబాబు అని మహిళలందరూ చాలా గర్వంగా చెబుతున్నారన్నారు. పింఛన్ల విషయానికొస్తే ఒకే సంతకంతో రూ.3 వేల పింఛను రూ. 4వేలు.. దివ్యాంగులకు పింఛన్ రెట్టింపు చేసిన ఏకైక సీఎం చంద్రబాబు అని, అలాంటి పాలనలో ఎవరు దేనికి భయడాల్సిన పరిస్థితి రాదన్నారు. దివ్యాంగుల పింఛన్ల విషయంలో వైకాపా చేస్తున్న విష ప్రచారాల్ని నమ్మాల్సిన పని లేదన్నారు. 64లక్షల మందికి ఏటా రూ,34 వేల కోట్లతో అందిస్తున్న సామాజిక పింఛన్లు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా పేర్కొన్నారు. దివ్యాంగుల పింఛన్ల మొత్తం లబ్దిదారుల్లో 1శాతం అర్హత లేని వారు ఉండడం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు నిదర్శనమని, వాటినే సరిచేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనర్హులుగా తేలిన వారిపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని, ఈలోపుగా వారే స్వచ్ఛందంగా వదులుకుంటే మంచదని సూచించారు. రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన అమరావతిపై ఇప్పటికీ అమానుష అసత్య ప్రచారాలు వైకాపాకి నీచ వైఖరికి నిదర్శనమన్నారు. వీటి మధ్యనే సీఎం చంద్రబాబు పోలవరం, అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారని త్వరలో ఆ ఫలితాలు చూస్తామన్నారు. 90శాతం రాయితీపై అందిస్తున్న డ్రిప్ పరి కరాలను రైతులంతా సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటల్లో కొత్త విప్లవం తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ను సద్వినియో గం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా చేయగలిగిన పనులు, పరిష్కరించగలిగిన సమస్యలు అన్నీ అక్కడ చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. రేషన్ కార్డులు లేని వారు వాటి కోసం దరఖాస్తులు చేసుకోవాలని… అవి వచ్చిన వెంటనే అర్హత ఉన్న వారి నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు పీవీ సురేష్ బాబు, గంధం కోటేశ్వరరావు, బొంకూరి రోశయ్య , గోవిందరాజులు, మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, శానిటరీ అధికారి ఎస్కే ఇస్మాయిల్, మున్సిపల్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. (Story:చంద్రబాబు 50 ఏళ్ల ప్రజాజీవితం నిజాయతీకి నిలువుటద్దం)
