Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అమర్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

అమర్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

0

అమర్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

న్యూస్‌తెలుగు/ విజయనగరం : పట్టణంలో ధర్మపురి రోడ్డు వద్ద గల అమర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు పాఠశాల డైరెక్టర్ వి ఇందుమతి ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదని దాన్ని మనం ఎన్నడూ మరవకూడదన్నారు. మనం ఎక్కడికి వెళ్లినా తెలుగు భాష యొక్క విశిష్టతను తెలపాలన్నారు. చిన్ననాటి నుండి విద్యార్థులతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారికి ప్రతి అంశం యొక్క గొప్పతనం తెలుస్తుందన్నారు. పాఠశాలలో అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య తో పాటు ఇటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి. రాంబాబు వైస్ ప్రిన్సిపల్ ఏ. శారద తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు వివిధ వివిధ వేషధారణలతో అందరిని అలరించారు. (Story:అమర్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version