సతీష్ యాదవ్ కు కొత్తకోట యాదవ సంఘం సభ్యులచే ఘణ సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఈనెల 16న కృష్ణాష్టమి రోజున పాండిచ్చేరిలో డాక్టరేట్ పొందిన సతీష్ యాదవ్ ఆ తర్వాత ఈ నెల 24 ఆదివారం విజయవాడలో గిడుగు రామ్మూర్తి అవార్డు అందుకున్న తరువాత మొదటిసారి ఈ రోజు వనపర్తి జిల్లా కు వస్తున్న సందర్భంగా కొత్తకోట లో యాదవ సంఘం నాయకులు స్వాగతం పలుకుతూ ఘణ సన్మానం చేశారు.
కొత్తకోట యాదవ సంఘం యొక్క మాజీ ఎం పి టి సి సత్యం యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు పైగా అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజా సేవ చేస్తున్న సతీష్ యాదవ్ గారికి డాక్టర్ రావడం ఆపై గిడుగు రామ్మూర్తి అవార్డు రావడం మాకందరికీ సంతోషదాయకముని ఈ సందర్భంగా కొత్తకోట మండలం యాదవ సంఘం సభ్యులచే వారికి ఘన సన్మానం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముంత సత్యం యాదవ్ మాజీ ఎంపిటిసి జి రాముల యాదవ్ మాజీ కౌన్సిలర్, ఎం బాల కొండయ్య, టీ మన్యం యాదవ్, D పెంటన్న యాదవ్, పి శంకర్ యాదవ్, కురుమూర్తి, శివన్న, కుమార్, బాలచంద్రి, మిగతా యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story:సతీష్ యాదవ్ కు కొత్తకోట యాదవ సంఘం సభ్యులచే ఘణ సన్మానం)

