గణేశ్ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న జీవి దంపతులు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలోని కొత్తపేట గణేశ్ మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, వారి సతీమణి లీలావతి దంపతులు పాల్గొన్నారు. సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపం వద్దకు వచ్చిన జీవి దంపతులను పూజారులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం, మండపం వద్ద ఉన్న భక్తులకు, నిర్వాహకులకు ఆయన గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.(Story:గణేశ్ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న జీవి దంపతులు)

