జీవీ అసమర్థత కారణంగానే శాంతి భద్రతలు కరువు
మాజీ ఎమ్మెల్యే బొల్లా
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీప్ విప్పు, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా వినుకొండలో శాంతి భద్రతలు కరువై ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్లా మాట్లాడారు. ఇటీవల నూజెండ్ల మండలం టి. అన్నారం గ్రామంలో వైసీపీ కార్యకర్త వెంకట ప్రసాదు పై. టిడిపి కార్యకర్తలు ముకుమ్మడిగా ఇంటికి వెళ్లి కత్తితో ఛాతిపై పొడిచి తీవ్రంగా గాయపరచని కేసులో. బాధితుడు పోలీస్ కేసు పెడితే. 307 కేసు బుక్ చేయకుండా కేవలం 224 పెట్టి కేసుగా పోలీసులు పెట్టారని ఇది దారుణమైన చర్య అని బొల్లా ధ్వజమెత్తారు. ఈ కేసును 307 గా పెట్టేవరకు తాము పోరాటం చేస్తామని, ప్రైవేట్ కేసు కూడా పెడతామని ఆయన హెచ్చరించారు. దాడి చేసిన వారు కేసు పెడితే అది 307 గా ఎలా పెట్టారని బొల్లా పోలీసులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే జీవీ, మక్కెన నిందితులకు సహకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను హత్యలు ప్రోత్సహిస్తానని జీవి మాట్లాడటం నిజం కాదని, హత్య లు చేయించే సంస్కృతి జీవికి మాత్రమే ఉందని, గతంలో ఆయన పార్ట్నర్ హత్యకు గురైన కేసులో జీవి ముద్దాయిగా ఉన్న విషయం అందరికీ తెలుసు అన్నారు. ఇటీవల పులివెందులలో పోలీస్ వలయంలో రిగ్గింగ్ చేయించుకొని గెలిచిన నాటినుండి, కూటమి ప్రభుత్వ దాడులు అధికమయ్యాయి అన్నారు. ఇక వినుకొండ పట్టణంలో దొంగతనాలు, హత్యలు పెరిగిపోయాయని, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నదని, దీనికి ఎమ్మెల్యే జీవి బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్యే జీవీ ఇంటి పక్కనే కే . సావిత్రి అనే మహిళ హత్యకు గురైతే నేటికీ కేసు తేల్చలేకపోయారన్నారు. అలాగే ఇటీవల కళ్యాణపురి కాలనీలో ఆలపాటి పుష్పలత, ఎన్ ఎస్ పి లో కోటి రత్నం హత్య తేలలేదని, పోలీసులపై జీవి. ఎందుకు ఒత్తిడి చేయరన్నారు. పట్టణంలో ఇళ్లల్లో మహిళలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని బొల్లా అన్నారు. ఇక నియోజకవర్గంలోని చేపల చెరువులు అన్నింటిని హస్తగతం చేసుకున్న నాయకుడు ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ఇక జీవి కనుసన్నల్లో ఒక ముఠా భూ కబ్జాలు బక్క వారిని బెదిరించి భూములు లాక్కోవడం. స్థానిక మిద్దె భావి సమీపంలో భూ కబ్జా చేయటం. ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసేందుకు మందులు ఇచ్చేందుకు. ఎమ్మెల్యే జీవీ అనుమతి అవసరమన్న దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది అన్నారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నరమేధం చేస్తుండగా, వినుకొండలో కూటమినేతలు వ్యాపారులను బెదిరించటం, క్రైస్తవ భూముల్లో అక్రమ ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేస్తున్నారన్నారు. మట్టి, రాయి, రేషన్, మద్యం, పోలీస్, రెవెన్యూ లాంటి వ్యవస్థలన్నింటినీ ముఠాలుగా ఏర్పడి వాటిపై పెత్తనం చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని, ఈ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే జీవీ అనుమతితోనే జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం ఎన్ ప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ లు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, గంధం బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.(Story : జీవీ అసమర్థత కారణంగానే శాంతి భద్రతలు కరువు )

