మహిళ క్రీడాకారిణిలకు సమదుస్తులు బహూకరించిన కిమ్స్ శిఖర హాస్పిటల్స్
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని నిర్మల ( ఐ సి ఎస్ ఈ) స్కూల్ క్యాంపస్ నందు కరుగుతున్న మహిళల సబ్ జూనియర్స్, సీనియర్స్ బాలికల బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారిణీలకు గుంటూరులోని కిమ్స్ శిఖరా హాస్పిటల్ మరియు కిమ్స్ చక్ర హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్లు కుళ్ళి జయ కిషన్, డాక్టర్ టి. మహతి లు క్రీడాకారిణీలకు సమదుస్తులు అందించినట్లు పాఠశాల హెచ్ఎం సిస్టర్ రాణి, సుపీరియర్ సిస్టర్ సిసిలి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాట్మెంటన్ కోశాధికారి కొల్లి. లక్ష్మీనారాయణ, అధ్యక్షులు ఈ శంకర్రావు, కార్యవర్గ సభ్యులు బి చంద్రశేఖర్, జగదీష్ రావు, జాయింట్ సెక్రెటరీ జోనా నాయక్ ,ఏ. డి. ఆంజనేయులు,పి.డి. రాధాకృష్ణమూర్తి, శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.(Story : మహిళ క్రీడాకారిణిలకు సమదుస్తులు బహూకరించిన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ )

