గీతాంజలి లో గణపతి మానవహారం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలు పురస్కరించుకొని గణపతి రూపంలో చేసిన మానవహారం విశేషంగా అలరించింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి తేళ్ళ కృష్ణవేణి మాట్లాడుతూ. చిన్నారులకు ఎంతో ఇష్టమైన పండుగలలో వినాయక చవితి ఒకటి అని ఈ పండుగని ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు అని అందుకే చిన్నారుల ఆనందం కోసం ఈ గణపతి మానవహారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి సందర్బంగా కెమికల్స్ తో తయారు చేసిన విగ్రహాలు మరియు ప్రతిమలు కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలు మరియు ప్రతిమలనే వాడి పర్యావరణ పరిరక్షణ కొరకు సాయపడవలసినదిగా కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story : గీతాంజలి లో గణపతి మానవహారం )
