పోస్టల్ శాఖలో ఉత్తమ అవార్డు అందుకున్న శ్రీనివాస్
న్యూస్ తెలుగు / చింతూరు : చింతూరు సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో పనిచేస్తున్న అల్లి శ్రీనివాసరావు సోమవారం అత్యుత్తమ అవార్డు పొందారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అత్యధిక సంఖ్యలో ఇన్సూరెన్స్ లు చేసినందుకు గాను పోస్టల్ సూపర్నెంట్ కే. శేషారావు, పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎస్.కె అబ్దుల్లా, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర చేతుల మీదుగా స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ లో అవార్డును ప్రధాన చేశారు. ఇటీవల పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్స్, కబడ్డీ, కోకో వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోస్టల్ శాఖ ఉద్యోగులకు యస్. పి., ఐ పి ఓ బహుమతులు ప్రధానం చేశారు.(Story : పోస్టల్ శాఖలో ఉత్తమ అవార్డు అందుకున్న శ్రీనివాస్ )

