కాంగ్రెస్ నాయకులు అనాలోచిత ఆలోచనలు మానుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణ మున్సిపల్ అధికారులు నల్లచెరువుపై వాహనాల రాకపోకలు జరగకుండా రెండు వైపుల రోడ్డుకు అడ్డంగా గేట్ల నిర్మాణం చెయ్యడానికి టెండర్లను పిలిచి,అట్టి పనిని వారు ప్రారంభించడం జరిగింది. ఈ మెయిన్ గేట్లు లేకుంటేనే ట్యాంక్ బండ్ ఎంతో శోభాయమానంగా ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటీ శ్రీధర్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు ట్యాంక్ బండ్ కట్టను వెడల్పు చేసి, సుందరీకరణ చేసి, భారీ వాహనాలు వెళ్ళడానికి సిసి డబల్ రోడ్డుని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాయంలో వేయడం జరిగింది. దీనితో వనపర్తి పట్టణంలోని భారి ట్రాఫిక్ రద్దీ రిత్యా గోపాల్పేట్ – ఘణపురం వెళ్ళే రోడ్డుకు బైపాస్లో వెళ్ళడానికి ఇట్టి రోడ్డును డిజైన్ చేసి గత ప్రభుత్వం హాయంలో ఏర్పాటు చేయడం జరిగినది. కాని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇట్టి రోడ్ పై భారి వాహనాలు వెళ్ళరాదంటూ నల్ల చెరువు ‘ట్యాంకుబండ్ రోడ్డుకు అడ్డంగా గేట్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి మరమత్తుకు భూమి పూజ చేసినారు. దానితో వనపర్తి పట్టణంలో నల్ల చెరువుపై దారికి అడ్డంగా నిర్మించతలపెట్టిన గేట్ల నిర్మాణం జరగకుండా చూసి,అట్టి చర్యలను రద్దు చేసి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి పట్టణ బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు నాగన్న యాదవ్, కంచె రవి,ఉంగ్లం తిరుమల్, హేమంత్ ముదిరాజ్, అవిశెట్టి భాగ్యరాజ్, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, జానంపేట శీను, తోట శీను, లక్ష్మన్ గౌడ్ పాల్గొన్నారు. (Story:కాంగ్రెస్ నాయకులు అనాలోచిత ఆలోచనలు మానుకోవాలి)

