వినుకొండ జస్టిస్ చిత్రానికి అవార్డు..
న్యూస్ తెలుగు /వినుకొండ : డా.వజ్రగిరి జెస్టిస్ చిత్రించిన ది కబీలర్స్ “చర్మకారులు” చిత్రానికి ప్రత్యేక ప్రశంసలు, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ విజయవాడ వారు రాష్ట్ర స్థాయిలో శ్రమైక జీవనం అనే అంశంపై ఆదివారం విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవన్ లో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో వినుకొండ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా. వజ్రగిరి జెస్టిస్ చిత్రించిన చిత్రం చూపరులను విశేషంగా ఆలోచింపజేసింది. రోడ్డు ప్రక్కన చెప్పులు కుట్టే పెద్దాయన , అతని కొడుకు వారసత్వంగా వచ్చిన వృత్తిలో అభివృద్ధి లేదని తన కొడుకును చదివిస్తున్నాడు, తెగిపోయిన తన బూట్ ను రిపేర్ చేస్తున్న తండ్రిని తదేకంగా చూస్తూ, తాను చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి వారికి అండగా నిలబడాలనే ఆలోచిస్తున్న అబ్బాయి చిత్రం ఎందరినో ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు సునీల్ అనుమకొండ, శేష బ్రహ్మం, గుండు నారాయణ తదితరులు జెస్టిస్ ను సత్కరించారు. ఈ సందర్భంగా వినుకొండ కు చెందిన ప్రముఖులు జెస్టిస్ ను అభినందించారు. (Story:వినుకొండ జస్టిస్ చిత్రానికి అవార్డు..)

