ఉత్సాహంగా కొనసాగుతున్న మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక నిర్మల స్కూల్లో గుంటూరు బాల్ బ్యాడ్మింటన్ మహిళల జట్టు మరియు సబ్ జూనియర్, సీనియర్ జట్లకు జరుగుతున్న శిక్షణ శిబిరాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాట్మెంటల్ అసోసియేషన్ సెక్రెటరీ వై.శ్రీనివాసరావు సందర్శించారు. ఈ శిక్షణ క్యాంపు ఈనెల 28 వరకు జరుగుతుందన్నారు. అనంతరం ఈనెల 29 నుండి 31 వరకు ప్రకాశం జిల్లా చేవూరులో జరిగే 11 వ రాష్ట్ర స్థాయి పోటీలలో క్రీడాకారిణిలు పాల్గొంటారని అన్నారు. అనంతరం ఈ కోచింగ్ ఉద్దేశించి సెక్రెటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఈ శిక్షణలో మంచి మెలకువలు నేర్చుకోవాలని , ఇప్పుడు తీసుకున్న శిక్షణ రాష్ట్ర స్థాయి పోటీలలో మెరుగ్గా ఆడేందుకు దోహదం చేస్తుందని అన్నారు. క్యాంపును ఉద్దేశించి నిర్మల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు వినుకొండ బీవీ రెడ్డి ఎలక్ట్రానిక్ బి.వి. సురేష్, సెవెన్ హిల్స్ బీఈడీ కాలేజీ కరస్పాండెంట్ దళారీ అనిల్ కుమార్ శిక్షణలో ఉన్న క్రీడాకారిణిలకు భోజన తదితర నిత్యవసరాలకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ జాయింట్ సెక్రెటరీ జోనా నాయక్, సుపీరియర్ సిస్టర్ సిసిలి, ప్రిన్సిపాల్ సిస్టర్ రాణి ,ఏ డి ఆంజనేయులు,పీఈటి శ్రీనివాసరావు,సంధ్య, ఉపాధ్యాయులు జిలాని పాల్గొన్నారు.(Story:ఉత్సాహంగా కొనసాగుతున్న మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు)

