ఈనెల 30,31 న జరిగే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలను ఈనెల 30, 31 తారీకు గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞానం మందిర్ లో జరగనున్న రాష్ట్ర మహాసభలకు న్యాయవాదులు హాజరు కావలసినదిగా వినుకొండ న్యాయవాద సంఘం అధ్యక్షులు మీసాల. శ్రీనివాసరావు, కార్యదర్శి పఠాన్. గౌస్ మొహద్దీన్ ఖాన్, ఉపాధ్యక్షులు పివి. రమణ రెడ్డి, సహాయ కార్యదర్శి నీలం. శేఖర్ బాబు, కోశాధికారి వరగాని శివ శంకర్ బాబు పిలుపునిచ్చారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు ముట్లూరి ఎలేషా బాబు, భీమవరపు శ్రీనివాసులు, బి. రామ్మోహన్, మారెళ్ళ సీతారామాంజనేయులు, రెడ్డిబోయిన బాబు ,దుగ్గిపోగు విజయ్, శివా నాయక్, లా. స్టూడెంట్ మస్తాన్ వలి, పాల్గొని (ఐ ఎల్ ఏ) వాల్ పోస్టర్లు( గోడ ప్రతులు) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పిజె . లూకా మాట్లాడుతూ. దేశ ప్రజలందరికీ సకాలంలో సత్వర న్యాయాన్ని అందరికీ అందించడం లక్ష్యంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పనిచేస్తుందని అన్నారు.(Story : ఈనెల 30,31 న జరిగే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి )

