వివిధ దేవాలయాలను సందర్శించిన సంధ్యారాణి
న్యూస్ తెలుగు/సాలూరు : శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి సతీ సమేతంగా సాలూరు పట్టణంలోని వివిధ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ముందుగా పట్టణంలో ఉన్న శ్రీ కామాక్షమ్మా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మరియు కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు ధర్మకర్త మండల సభ్యులు సాగర స్వాగతం పలికి ప్రత్యేకంగా ఆశీర్వచనాలు ఇచ్చారు.(Story : వివిధ దేవాలయాలను సందర్శించిన సంధ్యారాణి )


