మార్కెట్ యార్డ్ లో కిసాన్ మేళ
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మార్కెట్ యార్డ్ లో కిసాన్ మేళ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల స్టాల్ లను రైతు సోదరులు సందర్శించారు. ఈ స్టాల్స్ లో నూతన వంగడాలు పురుగు మందులు మరియు సూక్ష్మ పోషకాలు ప్యాకెట్లను రైతు సోదరులు పరిశీలించారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీయుత కింజారపు అచ్చం నాయుడు, చీఫ్ విప్. వినుకొండ శాసనసభ్యులు జి.వి ఆంజనేయులు, జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, నరసరావుపేట శాసనసభ్యులు, చదలవాడ అరవింద్ బాబు, సత్తెనపల్లి శాసనసభ్యులు, కన్నా లక్ష్మీనారాయణ, జనసేన జిల్లా ప్రెసిడెంట్ గాదె వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు శశి కుమార్, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ అరుణ్ బాబు స్టాళ్లను సందర్శించి రెండవ రోజు కూడా స్టాల్స్ ను రైతు సోదరులకు అందుబాటులో ఉంచాలని దీనివల్ల రైతు సోదరులు నూతన సాంకేతికత అందిపుచ్చుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, జిల్లా ఉద్యానవన అధికారి వెంకట్రావు, వినుకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు రవికుమార్, ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు రైతు సేవా కేంద్ర సిబ్బంది ,ఎరువులు, పురుగుమందుల అసోసియేషన్, రైతు సోదరులు పాల్గొన్నారు. (Story:మార్కెట్ యార్డ్ లో కిసాన్ మేళ)

