ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులకు అభినందనలు
న్యూస్ తెలుగు /వినుకొండ : నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులకు టిడిపి పట్టణ క్లస్టర్ ఇన్చార్జ్ పత్తి పూర్ణచంద్రరావు, రియల్ఎస్టేట్ జానీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్ లో ఉన్న ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్, వైస్ చైర్మన్ కే. శ్రీనివాసరావు లతో పాటు మిగతా సభ్యులను దుశ్యాలువా,పూల మాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసి కొండలు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కే. శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, యస్.కే బాండ్, బత్తుల వెంకటరావు, తుమ్మ వెంకటకోటమ్మ, శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.(Story:ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులకు అభినందనలు)

