వినుకొండలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక లాయర్స్ స్ట్రీట్ నందు ఎస్. ఆర్ కలర్ ల్యాబ్ నందు 186వ ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసనపల్లి సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను ఏకం చేయడానికి మరింత మందిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న జరుపుకుంటున్నామన్నారు. ఫోటోగ్రఫీ అంటే కేవలం ఫోటో తీయడమే కాదు.. మధురమైన క్షణాలను నిలబెట్టగలిగే ప్రత్యేకమైన కళ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు యార్లగడ్డ బుజ్జి, శ్యామ్, శ్రీనివాస్, బ్రహ్మం,సీపీ, కన్నయ్యల తో పాటు అధిక సంఖ్యలో వీడియో గ్రాఫర్లు ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. (Story:వినుకొండలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు..)

