Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చవితి మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి

చవితి మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి

చవితి మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి

న్యూస్ తెలుగు/ సాలూరు : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకున్న కమిటీ వారు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని సాలూరు పట్టణ పోలీసు సి ఐ అప్పలనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలూరు పట్టణంలో తే 27.0 8.2025 ది నుంచి జరగబోయే వినాయక ఉత్సవాలకు మండపాలుకై సంబంధిత కమిటీ వారు తప్పనిసరిగా పోలీసు వారు అనుమతి పొందవలెనని తెలిపారు.ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి వివరములు మండపాలు యొక్క ప్రదేశం, ఉత్సవాలు జరిపే తేదీలు, నిమజ్జనం జరిపే తేది లు పూర్తి వివరములు కూడిన సమాచారాన్ని పోలీసు వారికి ముందస్తుగాతెలియపరచవలెనని కోరారు.ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారు సూచ న మేరకు 9 దినములు* ( నవరాత్రులు ) లోపు నిమజ్జనం పూర్తి చేయవలెనని,ఉత్సవ కమిటీ కమిటీ వారు మండపాలు వద్ద ఏర్పాటు చేయు వినోద కార్యక్రమాలకు మరియు మైకులకు పోలీసువారి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవలెనని తెలియజేశారు.
మండపాలు నందు విద్యుత్తు మరియు అగ్నిప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు ఉత్సవ కమిటీ వారు తీసుకోవలెను మరియు సంబంధిత శాఖల యొక్క అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.కమిటీ సభ్యులు తమ మండపాలను మరియు వాటి వద్ద నిర్వహించబోయే వినోద కార్యక్రమాలు సమయములో ట్రాఫిక్కు మరియు శాంతి భద్రతలు విఘాతం కల్గకుండా ఎప్పటికప్పుడు పోలీసు వారికి సహకరించవలెనని తెలియజేశారు.గణేష్ ఉత్సవాలు జరిగే సమయంలో గానీ నిమజ్జనం సమయంలో గానీ డీజేలకు ఎటువంటి అనుమతి లేవని అన్నారు.కమిటీ సభ్యులు మండపాల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవలెనని,
మండపాలు వద్ద 24 గంటలు కమిటీ సభ్యులు ఉంటూ ఏదైనా అవాంఛనీయ కుండా సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలెనని కోరారు.
మండపాలు వద్ద మరియు పరిసర ప్రాంతాల్లో అశ్లీల డాన్సులు ఆసాంఘిక, మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిషేధమని గణేష్ ఊరేగింపు మరియు నిమజ్జనం కార్యక్రమాలు రాత్రి 11 గంటల్లోపు ముగించవలెనని తెలియజేశారు. (Story:చవితి మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!