Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అంతులేని అబద్ధాలు, అసత్యప్రచారాలకు కేరాఫ్‌గా జగన్

అంతులేని అబద్ధాలు, అసత్యప్రచారాలకు కేరాఫ్‌గా జగన్

0

అంతులేని అబద్ధాలు, అసత్యప్రచారాలకు కేరాఫ్‌గా జగన్

మెగా కిసాన్ మేళా ప్రారంభంలో అచ్చెన్నాయుడు, జీవీ, కన్నా ధ్వజం

వినుకొండలో మెగా కిసాన్ మేళాలను ప్రారంభించిన అచ్చెన్నాయుడు, జీవీ

న్యూస్ తెలుగు /వినుకొండ : రైతుల సాగు మెళకువలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మెగా కిసాన్ మేళా వేదికగా వైకాపా విమర్శలనూ గట్టిగా కూటమి ప్రభుత్వం ప్రముఖులు తిప్పికొట్టారు. ప్రజలు 151 నుంచి 11 స్థానాలకు పడేసినా బుద్ధి తెచ్చుకోకుండా అంతులేని అబద్ధాలు, అసత్య ప్రచారాలకు జగన్, వైకాపా కేరాఫ్‌గా మారారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారంతో రాజధాని అమరావతిపై ఇకనైనా విషం చిమ్మడం మానక పోతే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. వినుకొండ మార్కెట్ యార్డులో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా కిసాన్ మేళా జరిగింది. చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డ్రోన్లు, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, పశుసంవర్ధక, పట్టుపరిశ్రమ, ఉద్యానశాఖ, మత్స్యశాఖ, బ్యాంకింగ్ సేవలు తదితర రంగాలకు చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలు రైతులకు పంటల రక్షణ, అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యాన పంటల పెంపకం, డెయిరీ, ఫౌల్ట్రీ, చేపలు, గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాల్లో లాభాలు సాధించే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల చరిత్రలో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల కోసం పని చేసిందన్నారు. కానీ 2019లో ఒక దుర్మార్గుడు తప్పుడు హామీలిచ్చి సీఎం అయ్యాక తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, జగన్‌ నాటి అరాచక పాలనపై చురకలు వేశారు. గతేడాది ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ పిలుపు మేరకు కూటమి గెలిచి 164 సీట్లు సాధించిందన్న ఆయన ఈ విజయం కార్యకర్తల త్యాగ ఫలితమని కొనియాడారు. ప్రధాని మోదీ నేతృత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఊహించలేనంత సాయం అందిస్తోందన్న అచ్చెన్న అబద్ధాల మీద పుట్టిన పార్టీ, అబద్ధాల నాయకుడు జగన్ ఇప్పుడు కూడా అదే దుష్ప్రచారాలు కొనసాగిస్తు ఉండడం విచారకరమన్నారు. ఇకనైనా బుద్ధి మార్చుకోకపోతే త్వరలో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. రాష్ట్ర రైతులు ఆర్థిక ప్రగతిలో నెంబర్‌వన్‌గా ముందుకు వెళ్లాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్నారు. అందుకే ఉద్యాన పంటలకు పెద్దఎత్తున రాయితీలు ఇస్తున్నామ ని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు ఎకరానికి రూ.57 వేల రాయితీ, పండ్ల తోటలకు ఎకరానికి లక్ష వరకు రాయితీ ఇస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వైసీపీ పెట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నారన్నారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా అయిదేళ్లు పాలించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్న జగన్‌రెడ్డి నిజానికి రైతు ద్రోహి, శత్రువని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందన్నారు. రైతులకు కనీసం పంటల బీమా చెల్లించలేని అసమర్థుడు జగన్ అని ధ్వజమెత్తారు. అయినా ఇప్పటికీ దుర్మార్గపు విమర్శలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని, నాడు పులిచింతల గేట్లకు గ్రీజు పెట్టడం చేతగాని దద్దమ్మలు, గుండ్లకమ్మ గేట్లకు మరమ్మతులు చేయించడం చేతగాని అసమర్థులు ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక్కగేటు మొరాయిస్తే బ్యారేజీ కొట్టుకు పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిగి పోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికైనా దుష్ప్రచారాలు ఆపాలని లేకపోతే ప్రజలు వైసీపీ నాయకుల వీపులు విమానం మోత మోగిస్తారని మండిపడ్డారు. కొండవీటి వాగు వద్ద కాస్త నీళ్లు వస్తే ఫేక్ వీడియోలు తెచ్చి అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వినుకొండ, పల్నాడు ప్రాంతంలో పశు సంపద ఎక్కువగా ఉందన్న చీఫ్‌విప్ జీవీ ఈ ప్రాంత అవసరాల కోసం వెటర్నరీ కాలేజీ ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు. వినుకొండ ప్రాంతంలో చేపల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారని, రొయ్యల చెరువులు కూడా ఉన్నాయని, వారందరికీ విద్యుత్ రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 14 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, వారందరికీ రాయితీలు వచ్చేలా చూడాలని కోరారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఈ మేళాను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఐదేళ్లు జగన్‌ పాలనలో ప్రజలు రాక్షసపాలన అనుభవించారన్న ఆయన ఇప్పుడు రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ కింద శాంతి భద్రతలతో పాటు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాంతరంగా పొందుతోందన్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్యలో ఇచ్చిన సంక్షేమం ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్న ఆయన 2019లో ఓటమి కారణం చేసిన అభివృద్ధిని ప్రజల ముందు చెప్పకపోవడమే. వైసీపీ చేసే అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టకపోవడమే ప్రధాన కారణం అన్నారు. ఇప్పటికీ జగన్, అతని సోషల్ మీడియా బృందం అదే అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారని వాటిని ఎక్కడికక్కడ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య యుతంగా పాలించే కూటమి పాలనకు ప్రజలందరీ ఆశీస్సులు ఉండాలని కోరారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య జగన వైకాపా కుంపటి పెట్టాలని చూస్తున్నారని, రేపో మాపో ఆయన జైలుకు పోతే వీళ్లందరూ రోడ్లెక్కి పెట్రోల్ పోయించుకున్నట్లు నటించాలని, వారే అగ్గిపుల్ల గీస్తారని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నామని, పెట్రోల్ మీరు పోసుకుంటే అగ్గిపుల్ల జగన్‌రెడ్డి గీయిస్తాడని, మీ కుటుంబాల కోసం అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వ్యవసాయానికి సంబంధించిన 150 స్టాల్స్ రైతులను ఎంతో ఆకర్షించిందని. ఈ స్టాల్స్ మరో రెండు రోజులు పొడిగించి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆయన కోరారు. సైంటిస్టుల సలహాలు తీసుకుని ముందుకు సాగాలని ఆయన కోరారు వర్షాలు పడుతున్న క్రమంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా. డీఏపీ. తదితర అన్ని రకాలు ఎరువులు పుష్కలంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నారు. ప్రభుత్వం కల్పించే అన్ని రకాల స్కీములు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు…. జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గం భూములు అన్ని వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉందని ఉద్యానవన పంటలకు ప్రభుత్వం సబ్సిడీ పూర్తిస్థాయి సబ్సిడీ కూడా అందజేస్తున్నదన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే కౌలు రైతులు. సన్నకారు రైతులకు కూడా సహకార బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, కూటమి నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్రాక్టర్ల ప్రదర్శన..

మెగా కిసాన్ మేళా సందర్భంగా నియోజకవర్గంలోని రైతులు, కార్యకర్తలు, కూటమి నాయకులు కలిసి 350 ట్రాక్టర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ట్రాక్టర్ నడపగా, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణ పక్కన కూర్చుని రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు.(Story:అంతులేని అబద్ధాలు, అసత్యప్రచారాలకు కేరాఫ్‌గా జగన్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version