23 న చలో ఒంగోలు ను జయప్రదం చేయండి
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
న్యూస్ తెలుగు/ చింతూరు : ఈ నెల 23న ఛలో ఒంగోలు కార్యక్రమానికి జయప్రదం చేయాలని తూర్పుగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు తుఫానులు,వరదలు,అగ్ని ప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంలో బాధితులకు సేవా కార్యక్రమాలు అందించడంలో మతతత్వ శక్తులకు, విచ్ఛిన్నకర, వేర్పాటు వాదులకు వ్యతిరేకంగా దేశ సమైక్యతా సమగ్రతల పరిరక్షణకు సీపీఐ జనసేవాదళ్ వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు.ఈనెల23,24,25 తేదీలలో ఒంగోలులో జరుగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే ప్రజా ప్రదర్శనల్లో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతులో పాల్గొనే జనసేవాదళ్ వాలంటీర్ల శిక్షణా శిబిరాన్ని మంగళవారం ఉదయం స్థానిక ఆనందనగర్ పార్క్ వద్ద మధు ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మతోన్మాద శక్తులు పెచ్చుమీరి మతసామరస్యానికి విఘాతం కలిగిస్తూ అశాంతిని సృష్టిస్తున్న పరిస్థితుల్లో జనసేవాదళ్ వాలంటీర్లు దేశంలో మతసామరస్య సాధన లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. తొలుత సీపీఐ పతాకాన్ని మధు ఆవిష్కరించారు. మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, రెడ్డి రమణ, సుబ్బారావు తాతారావు కృప నాగేశ్వరావు సాయి సన్ని తదితరులు పాల్గొన్నారు.(Story : 23 న చలో ఒంగోలు ను జయప్రదం చేయండి )
