Home వార్తలు తెలంగాణ ప్రజావాణి ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి పెట్టండి, పెండింగ్ లేకుండా చూసుకోవాలి

ప్రజావాణి ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి పెట్టండి, పెండింగ్ లేకుండా చూసుకోవాలి

0

ప్రజావాణి ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి పెట్టండి, పెండింగ్ లేకుండా చూసుకోవాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, ప్రతి సోమవారం జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 22 ఫిర్యాదులు వచ్చాయి.ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story :ప్రజావాణి ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి పెట్టండి, పెండింగ్ లేకుండా చూసుకోవాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version